01-11-2025 07:20:36 PM
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణం లోని సిఈఆర్ సమీపంలోని 132 కెవి సబ్ స్టేషన్ పక్కన ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి చెట్ల పొదలను సింగరేణి వర్క్ షాప్ సివిల్ అధికారులు సిబ్బందితో కలిసి శనివారం చదును చేశారు.సబ్ స్టేషన్ ను అనుకొని నాగార్జున కాలనీ, ఉండగా సబ్ స్టేషన్ ఆవరణ మొత్తం చిట్టడవిని తలేపించే విదంగా ఉండటం దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలతో విష సర్పాలు కాలనీలోని కార్మిక గృహాలకు వస్తుండటంతో కార్మికులు వారి కుటుంబ సభ్యులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీయాల్సి వస్తుంది.
తమ ఇబ్బందులను గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి నాయ కులు సలేంద్ర సత్య నారాయణ, భీమనాదుని సుదర్శన్ ల దృష్టికి తీసుకెళ్లడంతో నాయకులు ఏరియా జిఎం రాధాకృష్ణ, వర్క్ షాప్, సివిల్ అధికారులతో మాట్లాడి విష సర్పాలు కార్మిక కాలనీ లోకి రాకుండా చూడాలని కోరడంతో స్పందించిన అధికారులు సబ్ స్టేషన్ ఆవరణ తో పాటు కాలనీ కి అనుకొని ఉన్న చిట్టడవిని జెసిబి సహాయంతో చదును చేశారు. ఈసందర్భంగా కాలనీ వాసులు నాయకులకు సింగరే ణి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.