calender_icon.png 9 December, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భిణీలకు వ్యాయామం, ఆహారంపై అవగాహన

09-12-2025 12:57:24 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్8: గర్భిణీలు చేయాల్సిన వ్యాయామాలు తీసుకోవలసిన ఆహార పదార్థాలపై మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్ అవగాహన కల్పించారు. సోమవారం అర్వపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు జరిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ గర్భిణీలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళ తేలికపాటి వ్యాయామాలు, యోగాసనాలు చేయాలని ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలో వివరించారు.

సహజ కాన్పు జరిగితే ప్రభుత్వం నుండి చేకూరే లబ్ధి వివరాలను తెలిపారు.క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత పరీక్షలు, మందులు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్స్ మాధవి, చొక్కాయ్య, అనూష, శకుంతల, ఆరోగ్య సిబ్బంది, ఆశాలు, గర్భిణీలు పాల్గొన్నారు.