calender_icon.png 9 December, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్లకు మౌలిక వసతులు కల్పించాలి

09-12-2025 12:56:19 AM

ఆర్డీఓ వేణుమాధవరావు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్ 8: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు మౌలిక సదుపాయాలైన త్రాగునీరు,టాయిలెట్ల వంటి సౌకర్యాలతో పాటు భద్రతను కల్పించాలని ఆర్డీఓ వేణుమాధవరావు సూచించారు. సోమవారం మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన జాజిరెడ్డిగూడెం, అడివెంల, కుంచమర్తి తదితర 29కీలకమైన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

ఓటర్ల జాబితా సక్రమంగా ఉందో లేదో తనిఖీ చేయాలని, ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు. ఆయన వెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు, ఎంపీడీఓ ఝాన్సీ, తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్త్స్ర సైదులు, గిర్దవార్లు జలంధర్ రావు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.