20-08-2025 05:52:08 PM
సదాశివపేట,(విజయక్రాంతి): సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో బుధవారం రైతువేదికలో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఖరీఫ్ పంటలలో చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులపైన కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం వారు అవగాహన కల్పించడం జరిగింది. అదే విధంగా ఆయిల్ పామ్ పంటల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా పండ్లు, కూరగాయలు, పూలను పెంచే రైతులకు ఉద్యాన శాఖ రాయితీలను అందిస్తుందని తెలిపారు. అదే విధంగా ఆయిల్ పామ్ సాగుకు ఎకరానికి 50 వేల సబ్సిడీ ని అందిస్తుందని సదాశివపేట ఉద్యాన అధికారి సునీత తెలిపారు.