calender_icon.png 20 August, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్కర కార్డుల వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాలి

20-08-2025 07:45:51 PM

నిర్మల్,(విజయక్రాంతి): గోదావరి పరిహాక ప్రాంతంలో నీరు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పుష్కర ఘాట్ ల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. బుధవారం నిర్మల్ జిల్లాలోని సోల్ మండల కేంద్రంలో గల గోదావరి పుష్కర ఘాటుకు సందర్శించి అక్కడ వరద పరిస్థితిని తెలుసుకున్న ఆమె భక్తులు ఎవరూ లోనికి వెళ్లకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని రక్షణ కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాకేష్ మీనా ఆర్డీవో రత్న కళ్యాణి రెవిన్యూ అధికారి మల్లేష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.