20-08-2025 08:05:43 PM
మేడిపల్లి: యువకులు ఉన్నత విద్యను చదువుకోవడంతోపాటు స్వశక్తితో పైకి రావాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి ఇంటీరియల్ డెకొరేటర్ వాణిజ్య సంస్థను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... ఉద్యోగాల కోసం వేచి చూడకుండా తనకు వచ్చిన విద్యను ఉపాధిగా మలుచుకొని తాను పైకి రావడంతో పాటు పదిమందికి ఉపాధి కల్పించడం సంతోషం అన్నారు.
ములుగు ప్రాంతంలో పుట్టి పెరిగిన తరుణ్ అనే యువకుడు హైదరాబాద్ నగరానికి వచ్చి తనకు తెలిసిన విద్యలో ఇంటీరియల్ డెకరేషన్ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. తను స్థాపించిన వ్యాపారంలో ఉన్నత శిఖరాలు ఎదగాలని, అందుబాటు ధరల్లో ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు.