20-08-2025 07:57:07 PM
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం(Rain) మొదలైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బోరబండ, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, గచ్చిబౌలి, మణికొండ, లింగంపల్లి,రాయదుర్గ్, ఫిలింనగర్, పటాన్ చెరు, ఎర్రగడ్డ, అమీర్ పేట, తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కాబట్టి చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.