calender_icon.png 20 August, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

20-08-2025 05:55:39 PM

కుమ్రం భీం  ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మెడికల్ కళాశాలకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు ప్రకటించారని, ఇప్పటివరకు నేను బోర్డు ఏర్పాటుచేయలేదని వెంటనే నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి తన సొంత నిధులతో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మెడికల్ కళాశాలకు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు సూచించారు.