20-08-2025 07:44:50 PM
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలను ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) జగదాంబ సెంటర్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు దొడ్డ డానియల్ సైదులు, నాయకులు ఎండి జాఫర్, మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, చల్ల శ్రీనివాస్, మండల రాము, తాటి భిక్షం తదితరులు పాల్గొన్నారు.