20-08-2025 08:03:08 PM
సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల
కొమురవెల్లి: యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే ఫర్టిలైజర్ దుకాణదారుల లైసెన్ రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో రైతు సంఘం అధ్యక్షులు బద్దిపడగ కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు.
రైతులకు సరిపడినంతయూరియాను ఫర్టిలైజర్ షాపుల్లో అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. యూరియా కొరత కారణంగా రైతుల నష్టపోతే, పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో కొరత కారణంగా రైతులు పంట చేనులలో ఉండే రైతులు యూరియా దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, జిల్లాకు రావలసిన కోటను విడుదల చేయాలని కోరారు.