calender_icon.png 20 August, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజ్వేల్ పాలిటెక్నిక్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారిణి

20-08-2025 07:48:16 PM

గజ్వేల్: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ అధికారిని  స్వరూపారాణి గజ్వేల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మెనూ అమలవుతుందా అన్న విషయంపై ఆమె పరిశీలించారు. కాగా విద్యార్థులు భోజనం బాగానే ఉందని, హాస్టల్ భవనాలు మొత్తం శిథిలావస్థకు చేరాయి అన్నారు. గోడల నుండి వర్షపు నీరు వచ్చి చలితో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ మూడేళ్లుగా రాకపోవడంతో  భోజనాల నిర్వహణకు డబ్బులు కట్టలేక అప్పులు చేయాల్సి వస్తుందని విద్యార్థులు వెల్లడించారు.