20-08-2025 07:59:12 PM
తూప్రాన్,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ తూప్రాన్‌కు గర్వకారణంగా క్లబ్ సెక్రటరీ లయన్ డాక్టర్ జానకిరామ్ ప్రతి ష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు. హైదరాబాద్ కొంపల్లి లోనీ కేవిఅర్ కన్వెన్షన్ లో నిర్వహించిన 320 డి డిస్ట్రిక్ట్ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో రామ్ మనోహర్ సౌభాగ్య ఆధ్వర్యంలో జరిగిన "జననీ జన్మ భూమిశ్చ" కార్యక్రమం భాగంగా నిర్వహించిన ఉపన్యాస పోటీలో లయన్ డాక్టర్ జానకిరామ్ లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గురించి ప్రేరణ కలిగించే విధంగా ఆయన ప్రతిభా పాటవాలతో అద్భుతంగా స్పీచ్ ఇచ్చి విజయం సాధించి స్పెషల్ కమాండెంట్ అవార్డ్ ను అందుకున్నారు.
ఈ అవార్డును అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఇంటర్ నేషనల్ డైరెక్టర్ పి.ఎం.జె.ఎఫ్. లయన్ డాక్టర్ గంటమనేని బాబురావు చేతుల మీదుగా లయన్ డాక్టర్ జానకిరామ్ సి.ఆర్ స్వీకరించడం విశేషం. ఈ సందర్భంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తూప్రాన్ ప్రెసిడెంట్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త, ట్రెజరర్ లయన్ నీల ప్రవీణ్ కుమార్ గుప్త, లయన్ జె. దామోదర్ రెడ్డి, లయన్ నేతి సాగర్ గుప్త, లయన్ పాదాల కిరణ్, లయన్ సి.ఆర్. ప్రవీణ్ కుమార్ గౌడ్, లయన్ దేవత, శ్రవణ్ కుమార్ గుప్త, లయన్ సబ్బనీ సుమంత్ గుప్త, టి. కృష్ణారెడ్డి తదితరులు పాల్గొని జానకిరామ్ సి.ఆర్ అభినందనలు తెలిపారు. ఈ విజయం తూప్రాన్ లయన్స్ క్లబ్‌కు మరింత గౌరవాన్ని తీసుకు వచ్చిందని సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.