న్యూక్లియర్ మెడిసన్‌పై అవగాహన పెరగాలి
బసవతారకం వైద్యులు డాక్టర్ జాకిర్ అలీ
బంజారాహిల్స్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): న్యూక్లియర్ మెడిసన్ తాజాగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విభాగం. దీని ద్వారా పీఈటీ-సీటీ లాంటి వ్యవస్థలను వినియోగించి పలు రోగాలను కచ్చితత్వంతో నిర్దారించవచ్చు. ఈ విభాగం పట్ల వైద్యుల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని బసవతారకం క్యాన్స ర్ హాస్పిటల్ న్యూక్లియర్ మెడిసన్ విభాగం హెడ్ డాక్టర్ జాకిర్ అలీ అన్నారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను కలిపి న్యూక్లియర్ మెడిసన్ పై ప్రత్యేక సదస్సును హాస్పిటల్లో ఆదివారం నిర్వహించారు. అడ్వానస్డ్ డయా గ్నస్టిక్ టెక్నిక్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ అన్న పేరుతో నిర్వహించిన ఈ సదస్సును బసవతారకం అకాడమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కల్పనా రఘునాథ్ తోలికి అలీ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో న్యూక్లియర్ మెడిసన్ విభాగం వైద్యులు, టెక్నాల జిస్టులు, ఫిజిస్టులు, విద్యార్థులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన 180 మందికి పైగా వైద్యు లు, న్యూక్లియర్ మెడిసన్ టెక్నాలజిస్టులు, న్యూక్లియర్ ఫిజిస్టులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






