27 April, 2026 | 1:52 AM

ఓయో లాడ్జ్‌లో మహిళ మృతదేహం లభ్యం

27-04-2026 12:00 AM

చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న నైట్ ఐ లాడ్జ్ (ఓయో)లో ఆదివారం ఉదయం 39 ఏళ్ల మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో బయటప డింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపిం ది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో హోటల్ సిబ్బంది గదిని తనిఖీ చేయగా మహిళ విగతజీవిగా ఉండటాన్ని గుర్తించారు.

వెంటనే చందానగర్ పోలీసులకు సమాచారం అం దించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.మృతురాలిని పటాన్‌చెరు మండలం ఇంద్రేషం గ్రామానికి చెందిన నర్సమ్మ(39)గా గుర్తించారు. ఆమె భర్త పేరు శంకర్. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో శనివారం రాత్రి నర్సమ్మ తనకు పరిచ యం ఉన్న ఒక వ్యక్తితో కలిసి ఓయో రూమ్ బుక్ చేసుకొని లాడ్జ్‌కు వచ్చినట్లు తెలిసింది.

ఆదివారం ఉదయం ఆ వ్యక్తి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది గది తెరిచి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీ నం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరణానికి గల ఖచ్చితమైన కారణాలు పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తాయని చందానగర్ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హోటల్లోని సీసీటీవీ ఫుటేజీలు, రిజిస్టర్లో నమోదైన వివరాలు, సిబ్బంది వాంగ్మూలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.