calender_icon.png 1 November, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలపై అవగాహన సదస్సు

01-11-2025 06:51:46 PM

వెంకటాపురం/నూగూరు (విజయక్రాంతి): పిల్లల వ్యక్తిత్వం నాయకత్వ లక్షణాలపై శనివారం మండల పరిధిలోని ఆలుబాక జడ్పీఎస్ పాఠశాలలో అవగాహన సదస్సు కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్. పి. పిస్ స్కూల్ హెడ్మాస్టర్ రమేష్, కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ లూర్ధు రాజు పాల్గొన్నారు. పిల్లలు అందరూ మంచిగా చదువుకొని జ్ఞానం పెంచుకోవాలని, పిల్లల పార్లమెంట్లో ఉన్న పదవుల ద్వారా మీలో నాయకత్వ లక్షణాలు పెంపొందాలని తెలియజేశారు. లీడర్‌షిప్ డెవలప్మెంట్ అంటే మనలో నాయకత్వ గుణాలు పెంచుకోవడం, దానికి కొన్ని మార్గాలు ఉన్నాయన్నారు.

1.మాట వినడం నేర్చుకోండి - ఇతరుల ఆలోచనలు గౌరవించండి, 2. ఆత్మవిశ్వాసం పెంచుకోండి - మీ ఆలోచనలు ధైర్యంగా చెప్పండి 3. సహకారం చేయండి - జట్టులో అందరితో కలిసి పని చేయండి, 4. మంచి నిర్ణయాలు తీసుకోండి - ఏది సరైనదో ఆలోచించి నిర్ణయం తీసుకోండి, 5. సేవా భావం కలిగి ఉండండి - ఇతరులకు సహాయం చేయండి వంటి విషయాల గురించి పిల్లలకి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ నుంచి వెంకటాపురం కోఆర్డినేటర్ హనుమంతు, వాజేడు మండల కోఆర్డినేటర్ కామేష్, యానిమేటర్స్ భాస్కర్, ప్రశాంత్, నరేష్, ఉష, పద్మ, ఇందిరా పాల్గొన్నారు.