01-11-2025 06:54:45 PM
ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): విద్యార్థులు ఒత్తిడి తగ్గించుకోవాలని, మానసిక ఉల్లాసం కోసం ధ్యానం వ్యాయామం చేయాలని, విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని, బ్రహ్మకుమారి సమాజం వక్త డా.సచిన్ పరాగ్, డా.ఉమా రాణి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బ్రహ్మకుమారి సమాజం, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఒత్తిడి నియంత్రణ అంశంపై విద్యార్థులకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టుదలతో చదివి భవిష్యత్తును బాగుండేటట్లు నిర్మించుకోవాలన్నారు.
అందుకోసం యోగ, వ్యాయామం ఒత్తిడిని తగ్గించుకునే మంచి సాధనాలుగా ఉపయోగపడతాయన్నారు. చదువులో మనకేమైనా బలహీనతలు ఉన్న వాటిని ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని బలమైన శక్తిగా మలుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్.పద్మావతి, డా.ఉమారాణి, లలిత, శ్రీకాంత్, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్ గజ్జెల గంగాధర్, అధ్యాపకులు క్యాతం సత్యనారాయణ, వాసరవేణి పర్శరాములు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.