18-10-2025 12:29:34 AM
మంథని, అక్టోబర్17విజయక్రాంతి) మంథని బాలికల పాఠశాల లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సిపిఆర్ ( కార్డియో పల్మనరీ రి సష్టియేషన్) గురించి అవగాహన సదస్సు 108 మంథని ఎమర్జెన్సీ టీం ద్వారా ఏర్పాటు చేశారు. ఒక వ్యక్తి అపస్మార్క స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా సిపిఆర్ చేయాలో ప్రయోగాత్మకంగా వైద్య పరికరాల ద్వారా వివరిస్తూ విశ్లేషించడం జరిగినది. ఎటువంటి పరిస్థితుల్లో 108 కి కాల్ చేయాలి 108 లో జరిగే పూర్వ ప్రాథమిక చికిత్స గురించి కూడా వివరించారు.
అపస్మార్క స్థితిలోకి వెళ్లిన వ్యక్తి కోసం 108 కి కాల్ చేసేముందు వారి సంబంధిత వ్యక్తులు ఏ విధంగా వారికి ట్రీట్మెంట్ చేయాలి 108 వచ్చిన తర్వాత ఏ విధంగా చికిత్స చేయడం జరుగుతుంది అనేది క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మంథని 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ వంశీధర్ రెడ్డి నిమ్మతి శ్రీనివాస్,పైలట్ తోట రాజేందర్, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుదాడి సుమలత, ఉపాధ్యాయులు కుమార్, భరత్ రెడ్డి, ఉమా మహేష్, శంకర, కృష్ణారెడ్డి,పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.