calender_icon.png 18 October, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంద్ శాంతియుతంగా ఉండాలి

18-10-2025 12:28:37 AM

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు  

డీజీపీ శివధర్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): బీసీ సంఘాల జేఏసీ శనివారం తలపెట్టిన బంద్ నేపథ్యంలో డీజీపీ శివధర్ రెడ్డి కీలక సూచనలు జారీ చేశారు. బంద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలని, నిరసనల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చ రించారు.  బీసీల హక్కుల కోసం బీసీ సం ఘాల జేఏసీ పిలుపునిచ్చిన బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలి, అని అన్ని రాజకీయ పార్టీలకు, సంఘాలకు సూచించారు.

బంద్ పేరుతో ఎవరైనా అ వాంఛనీయ ఘటనలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దిగినా చట్టప్రకా రం కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్ప ష్టం చేశారు. రాష్ర్టవ్యాప్తంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పోలీస్ సిబ్బంది, ప్రత్యేక నిఘా బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని ఆయన తెలిపారు.