31-08-2025 08:47:14 PM
మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ ఆఫీస్ లో కమిషనర్ ఏ.శైలజ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి పర్యావరణ ప్రభావములపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ... బహిరంగ ప్రదేశాలలో చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థలను కాల్చడం వలన పర్యావరణoపై ప్రభావం చూపునని, కార్బన్ మోనాక్సైడ్(CO), డయాక్సిన్లు, ఫ్యూరాన్లు కణిక పదార్థం వంటి విష వాయువులు గాలిలో కలిసి శ్వాస కోశ, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిషేధించామని తెలిపారు. కాల్చిన తరువాత వచ్చే బూడిద వలన భూ గర్భ జలాలు కలుషితo అవుతాయని, పారిశుధ్య సిబ్బంది, పట్టణ ప్రజలు స్వచ్ఛ బోడుప్పల్ కు సహాకరించాలని, ఎవరైనా ఇట్టి నిషేధమును అతిక్రమించినట్లయితే జరిమానా విధిస్తామని అన్నారు.