calender_icon.png 3 September, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేట్లు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేయాలి

01-09-2025 01:36:57 AM

-ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, ఆగస్టు 31(విజయక్రాంతి): రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు అమలయ్యేట్లు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు నివ్వాలని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం లిబర్టీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ  రాబో యే స్థానిక సంస్థల ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. అలాగే కొన్ని తీర్మానాలను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు పక్కాగా అమలు అయ్యేటట్లు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేయాలన్నారు.

అసెంబ్లీలో మాత్రమే బిల్లు పాస్ అయితే సరిపోదని,  పార్లమెంట్లో కూడా బీసీ బిల్లు పాసు కావడానికి బిజెపి నాయకులు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలన్నా రు.  అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వంపై గట్టిగా పోరాడాలన్నారు.  ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ కూడా సంపూర్ణ మద్దతు తెలియ చేయాలని, అసెంబ్లీ సమావేశాలు టైంపాస్  సమావేశాలుగా కాకుండా ప్రజా సమస్యలపై చర్చ జరగాలన్నారు.

ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించి వారికి పది లక్షల ఆర్థిక సహాయం చేయాలన్నారు. అలా గే రాష్ట్రంలో యూరి యా కొరత వల్ల అనేక పంటలు దెబ్బతిన్నాయని,  వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మాజీ కన్వీన ర్ బుర్ర రాముగౌడ్, మాజీ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ అన్సారి, మాజీద్, మహిళా నాయకులు, యమునా గౌడ్ హేమా సుదర్శన్ జిల్లోజు, జావీద్ షరీఫ్, దివ్యాంగ కమిటీ మాజీ అధ్యక్షులు దర్శనం రమేష్, యువజన విభాగం మాజీ అధ్యక్షులు విజయ్, తదితరులు పాల్గొన్నారు.