calender_icon.png 1 September, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

01-09-2025 01:33:14 AM

ముషీరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): భోలక్‌పూర్ డివిజన్‌లోని బాకారం లో గల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆలయ మేనేజింగ్ ట్రస్తీ నల్లబెల్లి అంజిరెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నల్లబెల్లి ఊర్మిల అంజిరెడ్డి ల ఆధ్వర్యంలో ఆదివారం మల్లన్నకు ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.

అదే విధంగా గణేష్ వేడుకల సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్ర మంలో రామానందరెడ్డి,  జ్ఞానేశ్వర్ యాద వ్,  మల్లికార్జున్ రెడ్డి, రవి గౌడ్, సతీష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. 

రాంనగర్‌లో..

ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్, అడిక్మెట్, గాంధీనగర్ డివిజన్లలో ఆయా మండపాల  నిర్వాహకులు ఏర్పాటు చేసిన వినాయకుడు విగ్రహం వద్ద బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్ హాజరై ప్రత్యేక పూజలు చేసి తమ ముక్కులను తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.