calender_icon.png 1 September, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా పోరాటంతోనే బీసీలకు రిజర్వేషన్లు

01-09-2025 01:35:34 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కడం వెనుక తన నిరంతర పోరాటం, హైకోర్టులో వేసిన పిటిషనే కారణమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ య్య స్పష్టం చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థాని క సంస్థల రిజర్వేషన్లపై తమ సంఘం చేసిన కృషిని వివరించారు.

2024లో తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈ విషయా న్ని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా పక్షపాతి అని, అన్ని రంగాల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించాలని ఆలోచిస్తున్నారని కృష్ణయ్య కొనియాడారు.

అయితే, పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్-కోటా ఇవ్వకపోతే అది అసంపూర్ణమే అవుతుందన్నారు. ఈ సమావేశంలోనే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జి పద్మను నియమిస్తున్నట్లు ఆర్ కృష్ణయ్య ప్రకటించి, నియామక పత్రాన్ని అందజేశారు.