calender_icon.png 1 September, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రీరాధాష్టమి వేడుకలు

01-09-2025 01:34:58 AM

-హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగష్టు 31 (విజయాక్రాంతి): బంజారాహిల్స్‌లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఆదివారం శ్రీ రాధాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణ భగవానుని నిత్య సఖీమణి శ్రీమతి రాధారాణి యొక్క దివ్య ఆవిర్భావతిథియైనశుభ సందర్భంగా నగరంలోని అనేక మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివార్ల దివ్య ఆశీస్సులను పొం దారు.

రాధాగోవిందులు అత్యద్భుతమైన ఆభరణాలతో అలంకరించబడి భక్తులకు ప్రత్యేకంగా దర్శనమిచ్చారు. వివిధ రకాల సుగంధ పుష్పాలతో అలంకరించబడిన దేవాలయం పరిమళభరితమైంది. సాయంసంధ్యా వేళలో వైదిక ఋత్విక్కుల వేద మంత్రోచ్ఛారణలు మరియు శ్రావ్యమైన హరినామ సంకీర్తనల నడుమ 108 కలశాలతో శ్రీ రాధాగోవింద అభిషేకం అట్టహాసం గా నిర్వహించారు. రాధాగోవిందుల ప్రీత్య ర్థం భక్తులంతా భక్తి పారవశ్యంతో రాధాష్టకమును గానం చేశారు.

స్వామి కోసం ప్రత్యే కంగా సిద్ధం చేసిన చప్పన్ భోగ్(56 విశేషమైన ఆహార పదార్థాలతో కూడిన నైవే ద్యం)వేడుకల్లోని మరో విశేషం. ఆ తరువాత స్వామివార్లకు విశేషమైన హారతిని అందించారు. హరే కృష్ణ మూవ్‌మెంట్, హైదరా బాద్ అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస్ ప్రభు.. ప్రవచనాలు వినిపిస్తూ రాధాష్టమి యొక్క ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు.

భాద్రపద మాసం (ఆగస్టు-సెప్టెంబర్) శుక్ల పక్ష అష్టమి తిథినాడు ఈ భువిపై అవతరించిన శ్రీమతి రాధారాణి సమస్త జగత్తు కూ తల్లి వంటిదని, ఈ పవిత్రమైన రోజున భక్తులంతా తమకు కృష్ణభక్తిని ప్రసాదించమని ఆ తల్లిని ప్రార్థిస్తారని వివరించారు.