calender_icon.png 3 August, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాలపై అవగాహన సదస్సు

03-08-2025 12:43:57 AM

తంగళ్ళపల్లి,(విజయకాంత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ నల్సా, టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఫైన్ ఆర్ట్స్ మహిళల డిగ్రీ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రాధా జైశ్వాల్ మాట్లాడుతూ... నల్సా పథకాలపై విద్యార్థులకు వివరించడమేగాక, ఉచిత న్యాయ సేవలు, మహిళల హక్కులు, పిల్లల రక్షణ, వృద్ధుల హక్కులపై వివరాలు అందించానన్నారు. న్యా య అవగాహన ద్వారా సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు.