calender_icon.png 3 August, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారం అడ్డుపెట్టుకొని దుష్ప్రచారాలు

03-08-2025 12:43:49 AM

నిజం ఎప్పటికైనా బయటపడుతుంది: కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖ వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు కాగ్నిషన్ ఇవ్వడంపై శనివారం ఎక్స్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే, వెంటనే కాకపోయినా నిజం ఎప్పటికైనా బయటపడుతుందన్నారు. అధికారాన్ని అ డ్డంపెట్టుకొని అర్థం లేని దుష్ప్రచారాలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ వారు తప్పించుకోలేరని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రజలు అధి కారమిచ్చింది ప్రతిపక్ష నాయకుల జీవితాలను బజారుకు లాగడం కాదని, ప్రజలకు సేవ చేయడానికి అందిన సదావకాశమన్నారు. పుకార్లు పుట్టించడానికి, ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోసేందుకు కాదన్నారు. రాజకీయాల పేరుతో విషం చిమ్మి తప్పించు కోగలమని భావించే ప్రతి ఒక్కరికీ కోర్టు తీర్పు గుణపాఠంగా నిలుస్తుందని తాను ఆశిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఇది సుదీర్ఘ యుద్ధమని, సగం దూరంలో ఉన్నానని, పోరాటం ఆపేది లేదన్నారు.