23-07-2025 12:20:14 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయ క్రాంతి) : మన అందరి లక్ష్యం అభివృద్ధి అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ కార్పోరేషన్ పరిధిలోని ఏనుగొండ, రామదూత టౌన్షిప్ కాలనీలో ముడా నిధులు రూ 25 లక్షలతో నిర్మించనున్న అధు నాతన పార్క్ నిర్మాణపు పనులకు, శ్రీనివాస కాలనీ లోని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో రూ10 లక్షల ముడా నిధులుతో నిర్మించనున్న షెడ్ నిర్మాణపు శంకుస్థాపన, భూలక్ష్మి కాలనీ లో పబ్లిక్ హెల్త్ నిధుల ద్వారా రూ 46 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ నిర్మాణపు పనులకు,
వేంకటేశ్వర కాలనీ హాయగ్రీవ టెంపుల్ దగ్గర గల పార్క్ ను రూ 10 లక్షల ముడా నిధులతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు,గొర్రె కాపరుల సంఘం భవనం ఆవరణలో రూ 30 లక్షలతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి,ఏనుగొండ లోని రా మదూత టౌన్షిప్ కాలనీలో రూ 25 లక్షలతో నిర్మించనున్న అధునాతన పార్క్ నిర్మాణపు పనులకు,నియోజకవర్గంలోని జమిస్తాపూర్ గ్రామానికి చెందిన రైతు చాకలి రాములమ్మ 50 రోజుల క్రితం అనారోగ్యం తో మరణించారు.
అందుకు సంబంధించిన రైతు భీమా చెక్కును రాముల మ్మ కుమార్తె నవ్యకు, అనుప వెంకట్ రాములుకు చెందిన రెండు ఆవులు గత సంవత్సరం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో మరణించడంతో విద్యుత్ శాఖ నుంచి 80000 ఎమ్మెల్యే ఇ ప్పించారు. హన్వాడ మండలం, గొండ్యాల, చిర్మల్ కుచ్చు తాండా లలో జరిగిన బోనాలు పం డుగ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ గా ఉన్న మహబూబ్ నగర్ ను కార్పోరేషన్ గా రూపాంతరం చేయడం జరిగిందని, మహబూబ్ నగర్ కార్పోరేషన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం ఎంతో అవసరమన్నారు. అందుకే నగరంలో అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మార్పు ఇప్పుడే మొదలైంద న్నారు. అభివృద్ధికి అందరూ మద్దతు తెలియజేయాలని కోరారు.
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసి సి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, నా యకులు సిజే బెనహార్, , వెంకటేష్ గౌడ్, రామస్వామి, కిరణ్ కుమార్, ఇమ్మడి పురుషోత్తం, సి హెచ్ మంజుల, సిహెచ్ జ్యోతి, రఘురామిరెడ్డి, మురళీ గౌడ్, వెంకటయ్య , రమేష్, సిఎంఓ బా లు యాదవ్, రవికుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.