6 April, 2026 | 1:13 AM

ప్రజల సౌకర్యార్థం ఎస్పీ సెంట్రల్ కంప్లైంట్స్

07-12-2024 08:03 PM

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రజల సౌకర్యార్థం ఎస్పీ సెంట్రల్ కంప్లైంట్స్ నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల కోసం 8712686142 నెంబర్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా పోలీస్ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్స్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి పిర్యాదు ఉన్న సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలన్నారు. పిర్యాదుపై చర్యలు తీసుకొని యెడల సంబంధిత సీఐ కు విషయం తెలియజేయాలన్నారు. డిఎస్పీ పిర్యాదు గురించి తెలియపర్చాలని, అక్కడ కూడా తగు చర్యలు తీసుకోనట్లయితే జిల్లా పోలీస్ కార్యాలయంలోని సెంట్రల్ కాంప్లెంట్ సెల్ నెంబర్ 8712686142కు సంప్రదించాలన్నారు. పోన్ కాల్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా గాని సంప్రదించాలన్నారు. ఇందుకోసం అన్ని పోలీస్‌స్టేషన్ ముందు బాగంలో ఒక బోర్డు మీద సంబంధిత పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్ పొందుపరుస్తూ బోర్డు రూపంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పిర్యాదు దారులకు సంబంధించిన ఎలాంటి పిర్యాదును అయిన సంబంధిత పోలీస్‌స్టేషన్స్‌ యందు సంప్రదించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే పిర్యాదుదారులతో మర్యాదతో మాట్లాడి వారి ఫిర్యాదును త్వరతిగతిన చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులకు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాలు జారీ చేశారు.