01-01-2026 12:53:36 AM
వెల్గటూర్, డిసెంబర్ 31(విజయక్రాంతి): ఇటీవల ఎన్నికల్లో సర్పంచ్ గా ఘన విజ యం సాధించిన వెల్గటూర్ సర్పంచ్ బండమీది కవితగోపి మండల తహసీల్దార్ రాపెల్లి శేఖర్, ఎంపిడీవో పాడి వెంకట్ ప్రసాద్ ల ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో స న్మానిoచారు. ఈ సందర్బంగా గ్రామంలోని నెలకొన్న సమస్యలను,వాటి పరిష్కార మా ర్గాలను గూర్చి చర్చించారు. రెండేళ్లుగా గ్రా మానికి సర్పంచ్ లేకపోవడం తో గ్రామంలో అనేక సమస్యలు పేరుకుపోయాయనీ, సమస్యల పరిస్కారంలో తహసీల్దార్, ఎంపీడీ వోల సహకారం కోరినట్లు ఈ సందర్బంగా సర్పంచ్ బండమీది కవితగోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎం. శ్రీనివాస్, గుమ్ముల సతీష్, బండారి రాజేందర్, ఎర్రోళ్ల అంబరీష్,గుమ్ముల వెంకటేష్, రామడుగు అభి తదితరులు పాల్గొన్నారు.