calender_icon.png 31 October, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మంత్రిగా అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది

31-10-2025 03:24:33 PM

హైదరాబాద్: రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin) రాష్ట్ర మంత్రివర్గంలోకి ప్రవేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రిగా అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందని అజారుద్దీన్ అన్నారు. మంత్రిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అజారుద్దీన్ కృతజ్ఞతలు లిపారు. ''నా గురించి కిషన్ రెడ్డికి పూర్తిస్థాయి అవగాహన లేదు'' అని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు సరైనవి కావాదని ఆయన వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని జోస్యం చెప్పారు. ఏ శాఖ  ఇచ్చినా ఇబ్బంది లేదన్న అజారుద్దీన్ తనపై వచ్చినవన్నీ ఆరోపణలు మాత్రమేనని కొట్టిపారేశారు. నాపై వచ్చిన ఆరోపణలు, పెట్టిన కేసులు రుజువు కాలేదని వెల్లడించారు.