calender_icon.png 1 November, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిటిష్, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యూనియన్ ఏఐటియుసి

31-10-2025 08:38:04 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): దేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి, రాష్ట్రం లో నైజాం పాలనకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ యూనియన్ కార్మిక వర్గ సంక్షేమం కోసం ఎర్ర జెండా స్పూర్తితో పోరాటాలు చేసిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి డిప్యూటీ  ప్రధాన కార్యదర్శి కె సారయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎండీ నజీర్ అహ్మద్ లు అన్నారు. శుక్రవారం ఇల్లందు పట్టణంలోని  విఠల్ రావు భవన్ ఆవరణలో జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొలుత సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి బ్రాంచ్ ఉపాద్యక్షులు దాసరి రాజారామ్ ఏఐటియుసి పతాకావిష్కరణ చేయగా,

అనంతరం వారు మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ పాలనలో ఏఐటీయూసీ యూనియన్ 1920 అక్టోబర్ 31 న ఎందరో స్వాతంత్ర్య సమర యోధుల చేతుల మీదుగా ఆవిర్భవించిందని,  దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ లో నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, స్వాతంత్ర్య పోరాటంలో కార్మిక వర్గాన్ని ఏక తాటి పై నడిపించిన ఘనత ఏఐటియుసి దేనని వారు అన్నారు. నాటి నుంచి నేటి వరకు కార్మికుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో నిర్విరామంగా పోరాటాలు, సమ్మె లు చేసి ఎన్నో హక్కులు సాధించిన ఘనత ఏఐటియుసి యూనియన్ కే దక్కుతుందని వారు తెలిపారు.

కార్మికులను సంఘటితం చేస్తూ, వారికి జరుగుతున్న అన్యాయాలు ఎత్తి చూపుతూ, పోరాటపటిమను చూపిన ఘన చరిత్ర ఏఐటియుసికి ఉందన్నారు. గత 105 ఏళ్ళు  పోరాడి సాధించుకున్న హక్కులను, 44కార్మిక చట్టాలను కేంద్రం లోని బిజేపి ప్రభుత్వం రద్దు చేసి నాలుగు కోడులుగా విభజించిందని, నాడు రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టీకరణకు, ప్రైవేటీకరణ కు పాల్పడిందని వారు ఆరోపించారు. సింగరేణి లో ఏఐటీయూసీ యూనియన్ అనేక పోరాటాలు చేసి కార్మికుల హక్కులు సాధించుకోవడం జరిగిందని, అమరవీరుల స్పూర్తితో వారి ఆశయ సాధన కోసం ముందుకు వెళ్ళాలని, ఏఐటియుసి ని బలోపేతం చేయాలని వారు కోరారు. పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పై ఏర్రజెండా యూనియన్ ఏఐటియుసి ఇచ్చే పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అమరజీవి గురు దాస్ గుప్తా 6వ వర్థంతి ఘనంగా నిర్వహించారు.గుప్తా చిత్రపటానికి కె సారయ్య, నజీర్ అహ్మద్ లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు గుప్తా కార్మికొద్యమ నాయకుడు అని అను క్షణం కార్మికుల సమస్యలపై పొరాటాలు నిర్మించెవాడని పార్లమెంట్ సభ్యులుగా వుంటు పార్లమెంట్ పక్ష సబ్యులుగా సిపిఐ పార్టీ నుండి తుది శ్వాస వరకు కొనసాగారని పార్లమెంటులో సంఘంటిత, అసంఘటిత, కార్మికుల సమస్యలు  పెనుభారం మోపిన  ప్రభుత్వం దృష్టి కి తిసుకెల్లి అనేక హక్కులు కార్మికుల పక్షాణ సాదించిన ధన్యుడు గుప్తా లేనిలొటు నేడు ప్రత్యక్షంగా అగుపిస్తున్నదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. నేడు కార్మికుల నడ్డివిరిచె విదంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ అనేక నల్ల చట్టాలు చెస్తావుంటె తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్లమెంట్ నిద్రావస్థలో ఉన్నారు అని వారు అన్నారు. గుప్తా అశయసాదన కొసం పార్టీ ప్రజా సంఘాలు పనిచెయాలని  సమావేశంలో  పిలుపు ఇచ్చారు