calender_icon.png 1 November, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుఫాన్ తో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలి

31-10-2025 08:48:43 PM

బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య

మఠంపల్లి: మొంథ తుఫానుతో పంటలు ఆగమాగం అయి రైతాంగం తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన ప్రతి ఎకరాకు 35వేల నష్టపరిహారం చెల్లించాలని భారత రాష్ట్ర సమితి మఠంపల్లి మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ మఠంపల్లి మండల పరిసర ప్రాంతాల్లో తుఫానుకు నీట మునిగిన, నేలమట్టమైన పంట పొలాలను పార్టీ సభ్యులతో  కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నీట మునిగిన పొలాలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వానాకాలం నాట్లు వేసింది మొదలు నిన్న మొన్నటి వరకు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతాంగం అష్టకష్టాలు పడి పంటలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారన్నారు. తీరా 15,20 రోజుల్లో పంటలు చేతికొస్తుందన్న దశలో తుఫానుతో రైతు ఆశలు నీరుగారిపోయాయన్నారు. రైతాంగం ఆవేదన తీర్చలేనిదని వెంటనే వ్యవసాయ,రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో నీట మునిగిన, పడిపోయిన పంట పొలాలను పరిశీలించి సర్వేనెంబర్ వారిగా,రైతుల వారీగా పేర్లను నమోదు చేసి, నివేదికలను ప్రభుత్వానికి పంపాలని కోరారు. ప్రభుత్వం ఎకరాకు 35 వేలు నష్టపరిహారం చెల్లించాలని, ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి,జిల్లాలో  ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఐకెపి కేంద్రాలలో తడిసి ముద్దవుతున్న ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.