calender_icon.png 1 November, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సవాలను జయప్రదం చేయండి: కలెక్టర్ అభిలాష అభినవ్

31-10-2025 08:27:06 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు సన్నద్ధం కావాలని జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం నిర్మల్ ఉత్సవాల పేరిట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందామని అన్నారు. నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని నిర్మల్ ఉత్సవాల వేదిక ద్వారా ఆవిష్కరించామని, ఈ సంవత్సరం కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి నిర్మల్ ఉత్సవాలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఎన్టీఆర్ మినీ స్టేడియాన్ని సిద్ధం చేయాలన్నారు. సుందరీకరణ పనులు చేపట్టి, మరుగుదొడ్లు, పెయింటింగ్స్, లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. పార్కింగ్ కొరకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని సూచించారు. జిల్లాలోని పాఠశాలల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

వివిధ సామాజిక మాధ్యమాలలో గుర్తింపు పొందిన జిల్లాకు చెందిన ప్రముఖులతో నిర్మల్ ఉత్సవాల కార్యక్రమ ప్రచారానికి సంబంధించి వీడియోలను రూపొందించాలని వివరించారు. జిల్లా ప్రజల నుంచి నిర్మల్ ఉత్సవాల కార్యక్రమం నిర్వహణ గురించి ఆలోచనలు, అభిప్రాయాలు ఆహ్వానించాలని సూచించారు.  సంబంధిత అధికారులంతా సమన్వయంతో పనిచేసి నిర్మల్ ఉత్సవాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.