31-10-2025 08:34:07 PM
 
							సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ లో 108 అంబులెన్సు ను శుక్రవారం పెద్దపెల్లి , కరీంనగర్ జిల్లా ప్రోగ్రామ్మింగ్ మేనేజర్ జనార్దన్ తనిఖీ చేశారు... ఇందులో భాగంగా మెడికల్ ఎక్విప్మెంట్ కు సంబంధించిన పరికరాలను, పనితీరులను అవి పని చేసే విధానమును అడిగి తెలుసుకోవడం జరిగింది. స్టెతస్కోప్, బీపీ ఆపరేటర్, పల్సాక్షి మీటర్, మల్టీ ఛానల్ మానిటర్, ఆక్సిజన్ వర్కింగ్ కండిషను అడిగి తెలుసుకున్నారు.
అత్యవసర సమయంలో కాల్ వచ్చినప్పుడు తక్షణమే స్పందించాలని అంబులెన్స్ సిబ్బందికి సూచించడం జరిగింది. 108 వాహనంలో తరలించే పేషంట్లను తరలించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తగు సూచనలు ఇవ్వడం జరిగింది.నిరంతరం అందుబాటులో ఉంటూ అందరికి సేవలందించాలని అంబులెన్స్ సిబ్బందికి సూచించడం జరిగింది.సుల్తానాబాద్ అంబులెన్స్ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఇరుగురాల రవివర్మ , పైలెట్ కారంగుల సంపత్ కుమార్ పాల్గొన్నారు.