31-10-2025 03:37:30 PM
 
							హైదరాబాద్: హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పర్యటిస్తున్నారు. హనుమకొండ సమ్మయ్యనగర్ లో దెబ్బతిన్న నాలాలను సీఎం పరిశీలించారు. వరద బాధితులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. సమస్యలపై బాధితులు సీఎంకు వినతిపత్రాలు అందజేశారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఉన్నారు. మొంథా తుపాన్ కారణంగా వరంగల్, హనుమకొండాలో భారీ వర్షాలు కురిశారు. వర్షాలతో హనుమకొండ, వరంగల్ జలదిగ్బంధం అయ్యాయి. పలు కాలనీలు నీట మునిగాయి.