calender_icon.png 31 October, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

“రన్ ఫర్ యూనిటీ”లో పాల్గొన్న బీజేపీ నేతలు

31-10-2025 03:11:02 PM

హైదరాబాద్: జాతీయ ఏకతా దివస్‌ సందర్భంగా నాంపల్లిలో నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ”(Run for Unity) కార్యక్రమంలో పాల్గొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సర్దార్ వల్లభభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. భారత స్వరాజ్య సంగ్రామానికి సమున్నత ముగింపు అందించిన క్రాంతదర్శి, నవభారత నిర్మాత, అద్భుత రాజనీతిజ్ఞుడైన సర్దార్ పటేల్ జీవితం ప్రతి భారతీయునికి ప్రేరణ. ఆయన ఐక్యత స్ఫూర్తి మన దేశ బలానికి మూలాధారని రామచందర్ రావు పేర్కొన్నారు. సంస్థానాల విలీనంలో ఆయన చూపిన వ్యూహం, సహనం, దూరదృష్టి స్వాతంత్ర్యానంతర భారత నిర్మాణానికి మార్గదర్శకం. ఆయన స్ఫూర్తితో యువతరం వికసిత భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారతీయ జనతా యువ మోర్చా నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సర్దార్ వల్లభభాయ్ పటేల్ కు నివాళులర్పించారు.