05-04-2025 05:22:06 PM
భద్రాచలం (విజయక్రాంతి): దేశ స్వాతంత్రం కోసం, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం, అలుపెరగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవయోధుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ అన్నారు. శనివారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఐటిడిఏ కార్యాలయంలోని యూనిట్ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... జగ్జీవన్ రామ్ 05 ఏప్రిల్ 1908 వ సంవత్సరంలో బీహార్ లోని వెనుకబడిన కులంలో పేద కుటుంబంలో జన్మించారు.
పేరొందిన స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, రాజకీయవేత్త, బీహార్ లోని వెనుకబడిన కులంలో పుట్టిన బాపూజీగా ఆయన ప్రసిద్ధి చెందారు. భారత పార్లమెంట్లో40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమై ఆల్ ఇండియా డిప్రెషన్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించడానికి వెనకాడేదే లేదని పట్టుబట్టారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు.
తరువాత గ్రామీణ, కార్మిక ఉద్యమాన్ని నిర్వహించి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి వారిలో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. అటువంటి మహనీయుని మననం చేసుకొని మనమందరం మంచిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమములో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ ర్ చంద్రశేఖర్, ఎస్ డి సి రవీంద్రనాథ్, ఏవో సున్నం రాంబాబు, ఎస్ ఓ ఉదయభాస్కర్, హెచ్ ఎన్ టి సి ఉదయ్ కుమార్, మేనేజర్ ఆదినారాయణ, జేడీఎం హరికృష్ణ, వివిద విబాగలకు చెందిన పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.