calender_icon.png 1 May, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి

05-04-2025 05:29:33 PM

బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులర్పించిన రాజ్ కుమార్ రెడ్డి..

నారాయణపేట (విజయక్రాంతి): భారత మాజీ ఉప ప్రధానమంత్రి దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహనీయులు చూపిన మార్గంలో యువత పయనించి వారి ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. నివాళులు అర్పించిన వారిలో ఆదిరాల రమేష్, మహేష్ యాదవ్, శివ తదితరులు పాల్గొన్నారు.