29-05-2025 12:15:14 AM
- ఖానాపూర్ బస్టాండ్ వద్ద ప్రైవేట్ వాహనాల ఆగడాలు
- ఆర్టీసీ లాభాలకు గండి.. అడ్డుకునే అధికారులేరీ..?
ఖానాపూర్ (విజయక్రాంతి); భాజాప్త... బస్టాండుకు అడ్డంగా పెడతాం.. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి... అన్న చందంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ బస్టాండ్ వద్ద ప్రైవే ట్ వాహనాల ఆగడాలు పెచ్చు మీరుతున్నా యి.
వీరిని అడ్డుకునే నాథుడు లేక వీరి ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఖానా పూర్ కొత్త బస్టాండ్‌కు ఇన్, అవుట్ ఒకటే గేటు ఉండటం వల్ల ఆర్టీసీ బస్సులు రాకపోకలు అదే దారి గుండా జరుగుతాయి. కాగా నిత్యం కిటకిటలాడే ఈ ఆర్టీసీ బస్టాండ్ నుం చి చుట్టుపక్కల వందల గ్రామాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
ఈ నేపథ్యంలో బస్టాండ్, బస్టాండ్ చు ట్టూ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. దాని ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి ఇదివరకే పం డ్ల దుకాణాలు, ఇతర దుకాణాలతో ఫుట్పాతే కాకుండా రహదారి కూడా కనిపించకుండా పోగా, రద్దీతో వాహనాల రాకపోకులకు ఆటంకంగా మారింది.
ఇదే అదునుగా ఇక్క డి దూర ప్రయాణం ఎస్ ఆటోలు ప్రయాణికులను బస్టాండ్ నుంచి లాక్కునే ప్రయ త్నంలో ఉన్న ఒక్కదారికి అడ్డంగా ఆటోలు నిలిపి ప్యాసింజర్లను గట్టిగా పిలుస్తూ, ఆర్టీసీ లాభాలకు గండి కొడుతున్నా రు. దీనిని అడ్డుకోవాల్సిన ఆర్టీసీ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో ఇక వీరి ఆగ డాలకు హద్దులేకుండా పోయింది.
వీరు కలిగించే ఆటంకాలకు మామూలు ప్రయాణికు లకు కూడా తలనొప్పిగా మారడమే కాకుం డా, బస్సులు బస్టాండ్ లోకి రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. దీనిని ఇకనైనా స్థానిక పోలీసులు ,ఆర్టీసీ సిబ్బంది పట్టించుకొని ప్రైవేట్ వాహనాల పార్కింగ్లు క్రమబద్ధీకరిస్తే బాగుం టుం దని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దాంతోపాటు బస్టాండ్ ఆవరణలో ప్రైవేట్ వాహనాల పార్కింగ్‌తో బస్సులు ముందు కు, వెనుకకు, తిప్పుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రమా దాలకు ఆస్కారంగా మారుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. బస్టాండు ముందు రోడ్డు, దాంతోపాటు పాత బస్టాండు, తెలంగాణ చౌకు, లారీ అడ్డ వరకు, ఏఎం కె ఫంక్షన్ హాల్ రోడ్డు, ప్రతిరోజు రద్దీతో ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.
ప్రతిరోజు ఏదో ఒక చోట చిన్నపాటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం వాహనాలను అదుపు చేయలేకపోవడమేనని ,రహదారికి అడ్డంగా ఆటోలు పెట్టి ఉంచడంతో, మరింత ప్రమాదకరంగా మారుతుందని ,స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు పట్టించుకోని రద్దీని వాహనాలను క్రమబద్ధీకరిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చునని పలువురు భావిస్తున్నారు.