24-07-2025 12:11:36 AM
నిజామాబాద్, జులై 23 (విజయ క్రాంతి): బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో బాలగంగాధర్ తిలక్ జయంతి నిర్వహించారు. నగరంలోని తిలక్ గార్డెన్ లో గల బాల గంగాధర్ తిలక్ విగ్రహానికి న్యాయవాదులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా న్యాయవాద జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ బాలగంగాధర్ తిలక్ స్వయం పాలన కోసం భారత స్వతంత్ర ఉద్యమంలో దేశభక్తి జాతీయ బావన్ని పెంపొందించడం కోసం కృషి చేశారని స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన పత్రికల ద్వారా స్వతంత్ర ఉద్యమాన్ని నిర్వహించారని ముఖ్యంగా
సమాజంలో స్వదేశీ ఉద్యమాన్ని జాతీయ సమైక్యత కోసం అందరిని ఏకతాటి తీయడం సామూహిక గణేష్ ఉత్సవాలను కూడా నిర్వహించి జాతీయ భావాన్ని ఐక్యమత్యాన్ని నెలకొల్పేందుకు తీవ్రంగా కృషి చేశారు పేర్కొన్నారు కార్యక్రమంలో పరిషత్ న్యాయవాదులు రాజ్కుమార్ సుబేదార్ నారాయణ దాస్ వసంతరావు కోటేశ్వరరావు కేశవరావు భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.