calender_icon.png 26 August, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూపాలపల్లి జిల్లాకు సిల్వర్, బ్రాంజ్ మెడల్స్

25-08-2025 11:08:47 PM

రేగొండ,(విజయక్రాంతి): నిరంతర కృషి,లక్ష్య సాధనకు చేసిన పనులే జిల్లాకు సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ తీసుకువచ్చాయని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో వెనుకబడిన జిల్లాల ప్రగతికి నీతి అయోగ్ ప్రకటించిన యాస్పిరేషన్ బ్లాకు సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో రాష్ట్రస్థాయిలో భూపాలపల్లి జిల్లాకు సిల్వర్, బ్రాన్జ్ మెడల్స్ సాధించిన సందర్భంగా అధికారులకు సిబ్బందికి అవార్డుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.... క్షేత్రస్థాయిలో పనిచేసిన సిబ్బంది, అధికారులను అభినందించారు.మన జిల్లా యాస్పిరేషన్ నుండి ఇన్స్పిరేషన్ జిల్లా కావాలని ఆయన కోరారు. నీతి అయోగ్ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో విద్య, ఆరోగ్యం, వైద్య, వ్యవసాయం, మౌలిక వసతులు, సామాజిక సంక్షేమం వంటి ఆరు ముఖ్య సూచికలపై 100 శాతం అభివృద్దే లక్ష్యంగా పనిచేసి రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణత సాధించి గుర్తింపు పొందినట్లు తెలిపారు.

పలిమల, మహముత్తారం, మండలాలు బ్లాక్ స్థాయిలో ఐదు సూచికలను విజయవంతంగా పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాయని అన్నారు. భవిష్యత్తులో జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబడేలా చర్యలు కొనసాగించాలని కలెక్టర్ అధికారులకు తెలియజేసి మంత్రం ఆయా విభాగాల అధికారులకు సిబ్బందికి మెమెంటో లు,ప్రశంసా పత్రాలు అందజేశారు.