calender_icon.png 24 August, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాంసెప్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

24-08-2025 06:12:39 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): బామ్ సేపు 12వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని బివిఎం రాష్ట్ర కన్వీనర్ భూంపల్లి రవితేజ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో ఆదివారం బాంసేపు రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈనెల 31న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్న బాంసేపు, రాష్ట్రీయ మూల్ నివాసి సంగ్ 12వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలన్నారు.

తెలంగాణ నలుమూలల నుంచి విద్యార్థిని, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, మేధావులు తరలి రావాలన్నారు.  ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ దేశంలోని అనేక సమస్యల మీద పోరాడుతున్నటువంటి సంఘం బాంసెప్ అన్నారు. ఓబీసీ కుల జనగణన జరపాలని, ఈవీఎం మెషిన్లను తొలగించాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని బాంసేపు పోరాటం చేస్తుందన్నారు.