calender_icon.png 25 August, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక స్థైర్యానికి తైక్వాండో అవసరం: ఎస్సై సురేష్

24-08-2025 11:41:58 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడానికి తైక్వాండో అవసరమని స్థానిక ఎస్సై గోపతి సురేష్ అన్నారు. మున్సిపాలిటీలో గురునానక్ కాంప్లెక్స్ లో మంచిర్యాల జిల్లా తైక్వాండో సెక్రెటరీ మాస్టర్ జిల్లపెల్లి వెంకటస్వామి, మంచిర్యాల జిల్లా తైక్వాండో అధ్యక్షులు బుజ్జిరామరావు సహకారంతో, జిల్లా ట్రెజరరీ కామిల్ల సుధాకర్ మాస్టర్  ఆధ్వర్యంలో ఆదివారం తైక్వాండో కరాటే అకాడమీ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎస్సై గోపతి సురేష్ హాజరై  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ... క్రీడలు కేవలం వినోదమే కాదు, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి, క్రమశిక్షణను, మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి,  సామాజికంగా ఎదగడానికి ఒక ముఖ్యమైన మార్గం అని అన్నారు. ఆధునిక జీవితంలో చదువుల భారం పెరిగి, పిల్లలు క్రీడలకు దూరమవుతున్నారు. వాటి ప్రాముఖ్యతను గుర్తించి గుర్తుచేస్తూ ఇలా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయమన్నారు.