calender_icon.png 3 August, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్ల అక్రమ ప్రాజెక్టు

03-08-2025 12:45:37 AM

  1. ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేశ్ వ్యాఖ్యలు సరికాదు
  2. కేంద్రంతో పొత్తుందని ఇష్టారీతిన ప్రేలాపనలు
  3. బనకచర్లను ఆపేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం
  4. కమిషన్ నివేదిక అధ్యయన కమిటీతో ఆదివారం సమావేశం
  5. క్యాబినెట్‌లో చర్చిస్తాం..
  6. మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాం తి): పోలవరం-బనకచర్ల లింక్ ఒక ఇల్లీగల్ ప్రాజెక్టు అని, ఆ ప్రాజెక్టుపై ఏపీ మం త్రి లోకేశ్ వ్యాఖ్యలు సరైనవి కావని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. లోకేశ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. శనివారం సచివాలయం లో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రా జెక్టును తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.

బనకచర్ల ప్రాజెక్టును పర్యావరణ శాఖ, జీఆర్‌ఎంబీ వ్యతిరేకించిందని గుర్తుచేశా రు. తానే స్వయంగా తన లెటర్ హెడ్‌తో కేంద్రానికి లేఖలు రాసినట్టు స్పష్టం చేశా రు. బనకచర్లపై తమ ప్రభుత్వ స్టాండ్ క్లియర్‌గా ఉందని, బనకచర్లను ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. పబ్లిసిటీ కోసమే బీఆర్‌ఎస్ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నాయకుల గాలి మాటల్లో వాస్తవం లేదని వాపోయారు. బనకచర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని, ఆ ప్రాజెక్టును ఆపడానికి ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీతో టీడీపీ పొత్తు ఉందని లోకేశ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఇది ప్రజాస్వామ్య దేశమని, పొత్తు ఉందని మాట్లాడితే కుదురదని హితవు పలికారు. 650 పేజీలతో కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. ఆది వారం సాయంత్రం కమిషన్ రిపోర్ట్ అధ్యయన కమిటీతో సమావేశమవుతామని పేర్కొన్నారు. ఈ నెల 4న క్యాబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై చర్చిస్తామని వెల్లడించారు.