calender_icon.png 13 September, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని

12-09-2025 10:27:39 PM

హనుమకొండ,(విజయ క్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని శుక్రవారం ఉదయం వరంగల్ పశ్చిమ ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దసరా శరన్నవరాత్ర మహోత్సవముల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్  దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, దేవాలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్.  బింగి సతీష్ తదితరులున్నారు. అనంతరం దేవాలయ ధర్మకర్తగా కటకం రాములు తో దేవాలయ కార్యాలయంలో సహాయ కమీషనర్ కార్యాలయ పర్యవేక్షకులు కె. కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయించారు.