12-09-2025 10:23:44 PM
బొగ్గు లారీ ట్రాక్టర్ ఢీకొని మెయిన్ రోడ్డుపై విగ్రహాలు ధ్వంసం
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రం ప్రధాన చౌరస్తా ఎక్స్ రోడ్డు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జనగాం వైపు నుండి బొగ్గు లోడుతో వస్తున్న లారీ, మోత్కూర్ రోడ్డు నుంచి వస్తున్న ట్రాక్టర్ డోజర్ ను ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో చౌరస్తా పరిసరాలు, మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఏమి జరిగిందో అని తెలియని పరిస్థితిలో ప్రజలు పరుగులు తీశారు. స్థానిక పోలీస్ సిబ్బంది వచ్చి దర్యాప్తు చేసి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు