12-09-2025 10:32:30 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లి మండలం ఎలగందల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దాతల సహకారంతో బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అందుతున్న సౌకర్యాలను, సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో రాణించి సొంత కాళ్లపై నిలబడాలని సూచించారు. పదిమందికి సాయం చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎలాంటి సహకారమైనా అందిస్తామని, పట్టుదలతో చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాగులు అందజేసిన దాత మేడి నగేష్ ను అభినందించారు. పాఠశాలలకు పంపిణీ చేసిన గోడ గడియారాల్లో సూచించిన 12 అంశాలను తెలిపే విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది.