calender_icon.png 13 September, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోటో ట్రేడ్ ఎక్స్‌పోను విజయవంతం చేయాలి

12-09-2025 10:39:12 PM

మందమర్రి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం, ఫోటో టెక్, ఎడిట్ పాయింట్ ఆద్వర్యంలో  నిర్వహిస్తున్న ఫోటో ట్రేడ్ ఎక్స్ పో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కోరారు. పట్టణం లోని మున్సిపల్ కార్యాలయం లో శుక్రవారం పట్టణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎక్స్ పో కార్యక్రమం వాల్ పోస్టర్లను మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫోటోగ్రఫీ సృజనాత్మక పూర్తిగా మారిందని, ఇటువంటి ఎక్స్ పో లకు కొత్త పరికరాలు డిజిటల్ టెక్నాలజీ ఫోటోగ్రాఫర్ లకు ఎంతగానో దోహద పడతాయన్నారు. యువత ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవడంతో మంచి ఉపాధి అవకాశాలు పొందగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. సంఘం జిల్లా పట్టణ అధ్యక్షుడు అప్పాసు  రామన్న, పసుల వెంకటస్వామిలు మాట్లాడుతూ... హైదరాబాద్ లోని ఓం కన్వెన్షన్ హాల్ లో సెప్టెంబర్ 19, 20, 21 మూడు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఫోటోగ్రాఫర్ల పండుగైన హైదరాబాద్ ఫోటో ట్రేడ్ ఎక్స్ పో కార్యక్రమాన్ని ఫోటో, వీడియో గ్రాఫర్లు అధిక సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని కోరారు. ఆధునిక టెక్నాలజిని  ఫోటోగ్రాఫర్లు వాడుకోవాలని, ఎక్స్ పో లో కెమెరాలు, లెన్స్, డ్రోన్లు, ప్రింటింగ్ పరికరాలు, లైటింగ్ సిస్టం, ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు, స్టూడియో మోడల్స్ ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ఫోటోగ్రాఫర్లు, ప్రొఫెషనల్ స్టూడియో పై ఆసక్తిగల యువత ఈ ఎక్స్ పోలో పాల్గొని, ప్రయోజనం పొందాలని సూచించారు.