calender_icon.png 13 September, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఐహెచ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

12-09-2025 10:15:55 PM

కరీంనగర్ క్రైమ్: ప్రవక్త మహ్మద్ జన్మదిన మాసోత్సవాల సందర్భంగా జమాతే ఇస్లామి హింద్(జేఐహెచ్), రుమాన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ సౌజన్యంతో నగరంలోని తెలంగాణ చౌక్, నాకా చౌరస్తాలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. తెలంగాణ చౌక్ రక్తదాన శిబిరాన్ని వన్ టౌన్ సీఐ రాంచందర్ రావు ప్రారంభించగా, మాజీ కార్పొరేటర్లు ఫేరోజ్, రమణ రావు, జేఐహెచ్ మంకమ్మతోట ప్రెసిండెంట్ ఎండీ ఖైరుద్దీన్, సాజిద్ ఖాన్, సీనియర్ జర్నలిస్టు నిసార్ అహ్మద్, మౌలానా షోహెబ్ లతిఫీ, షాద్, జేఐహెచ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సోహెబ్ అహ్మద్ ఖాన్, మొహ్మద్ అబరారుద్దీన్, ఎండీ జకరీయ, అజీజ్ మహ్మద్, అమ్మార్ లతిఫీ తదితరులు పాల్గొన్నారు. నాకా చౌరస్తాలో త్రీటౌన్ సీఐ జాన్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... సేవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని, ఒకరి రక్తదానంతో ఒకరి ప్రాణం కాపాడవచ్చని పేర్కొన్నారు. రక్తదానం మహాదానం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమి, జేఐహెచ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సోహెబ్ అహ్మద్ ఖాన్, మాజీ కార్పొరేటర్ అలీ బాబా, రజ్వి చమన్ ప్రెసిడెంట్ ఎండీ రఫీఖ్, కార్ఖానగడ్డ ప్రెసిడెంట్ ముజమ్మిల్ ఇర్ఫాన్, రుమాన్ హాస్పిటల్ డైరెక్టర్ అజరుద్దీన్ ఖాన్, నయీం, కరీం తదితరులు పాల్గొన్నారు. రెండు చోట్ల నిర్వహించిన శిబిరాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఆయా శిబిరాల నుంచి మొత్తం 150 యూనిట్ల రక్తం సేకరించినట్టు మదర్ థెరిస్సా బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ వారు తెలిపారు. ఈ శిబిరాల్లో కులమతాలకు అతీతంగా చాలా మంది రక్తదానం చేశారు. రక్తదాతలకు జేఐహెచ్ డిస్ట్రిక్ట్ ప్రెసెడింట్ సోహెబ్ అహ్మద్ ఖాన్ అభినందనలు తెలిపారు.