03-12-2025 12:00:00 AM
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్
జవహర్ నగర్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డ్ తరలించాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ నీటికన్నా ప్రమాదకరంగా డంపింగ్ యార్డ్ రసాయనాలు తయారయ్యాయని,
లిచెట్ ట్రీట్మెంట్ అంటూ ఊదరగొట్టే ప్రకటనలే తప్పితే చేసిందేమీ లేదని, ఇక్కడి చెరువులన్నీ పూర్తిగా కలుషితం అయ్యయని, చెపలు కూడా మృత్యువాత పడుతున్నాయని, 5 లక్షల మంది ప్రజల ఆరోగ్యం అగమ్యగోచరంగా మారిందని, రాంకీ యాజమన్యం, ప్రభుత్వం పట్టించుకోకుంటే ప్రజలే తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
2017లో గత ప్రభుత్వం నగరంలోని చెత్తను నలుమూలాల తరలించి డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామని అఫిడవిట్ దాఖాలు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి దిక్కులేదని అన్నారు. గతంలో నిత్యం 300 టన్నుల చెత్తను తీసుకువస్తే... ఇప్పుడు 10వేల మెట్రిక్ టన్నుల చెత్తను తీసుకువచ్చి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని అన్నారు. జవహర్ నగర్ గ్రామం నుంచి చెత లారీలు రావొదని బీజీపి నాయకుడు పోరాడితే లారీ డ్రైవర్లతో దాడులు చేయడం తగదన్నారు.
ప్రభుత్వం వెంటనే పట్టించుకొని డంపింగ్ యార్డ్ ద్వారా వెదజళుతున్న దుర్వాసను తగ్గించాలని లేదంటే ప్రజలతో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి, బుద్ధి శ్రీనివాస్, ఆనంద్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, చంద్రారెడ్డి, కమల్, మహేందర్ యాదవ్, సంతోష్, పుణ్యరాజు, సన్నీ, లిఖిత యాదవ్, లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.