13-05-2025 12:26:55 AM
ఎస్సీ కార్పొరేషన్ ఇడి ఖలీల్
నారాయణపేట. మే 12 (విజయక్రాంతి) : రాజీవ్ యువ వికాసంలో బ్యాంకర్లది కీలక పాత్ర ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్ అన్నారు. సోమవారం మక్తల్ ఎంపీడీవో కార్యాలయంలో జే. ఎం. యల్. బి. సి. సమావేశానికి హాజరయ్యారు.
రాజీవ్ యువ వికాసం పథకం మార్గదర్శకాలను వివరించారు. బ్యాంకు నిబంధనల ప్రకారం అభ్యర్థుల అర్హతను ధ్రువీకరించే డాక్యుమెంటేషన్ పూర్తి చేయాలని 15వ తేది లోపు తాత్కాలిక అర్హత గల అభ్యర్థుల జా బితా సిద్ధం చేయాలని తదుపరి ప్రక్రియ కోసం ప్రతి రోజు సంబంధిత ఎంపీడీవోలకు అందించాలని బ్యాంకు మేనేజర్లను కోరడం జరిగింది.
ఈ సమావేశంలో ఎల్డిఎం విజయ్ కుమార్, ఈ. డి ఎస్. సి. కార్పొరేషన్ అబ్దుల్ ఖలీల్, డీఎండబ్ల్యూఓ రషీద్, మున్సిపల్ కమిషనర్ శంకర్, ఎం పి. డి. ఓ. రమేష్ కుమార్, ఎస్. బి. ఐ. కన్వినియర్, బ్యాంకర్లు ఎంపీడీవోలు పాల్గొన్నారు.